అమరావతి: నాణ్యమైన బియ్యం డోర్‌డెలివరీపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
శ్రీకాకుళంలో అమలవుతున్న పైలట్ ప్రాజెక్టుపై వివరాలు నివేదించిన అధికారులు
నాణ్యమైన, ప్యాకేజ్డ్ బియ్యంపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ బాగుందని సీఎంకు వివరించిన అధికారులు
*వచ్చే ఏప్రిల్ నుంచి మిగిలిన అన్ని జిల్లాల్లో నాణ్యమైన, ప్యాకేజ్డ్ బియ్యాన్ని పంపిణీచేయడానికి అవసరమైన సన్నాహాలపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు*
రైతులనుంచి బియ్యం సేకరణ, ప్యాకేజ్డ్ యూనిట్ల ఏర్పాటు, గోడౌన్లలో బియ్యాన్ని భద్రపరుస్తున్న తీరు తదితర అంశాలను సమీక్షించిన సీఎం
ఎక్కడా కూడా అలసత్వానికి దారితీయకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలన్న సీఎం
ప్రతి లబ్ధిదారుడి ఇంటికీ నాణ్యమైన బియ్యాన్ని∙మంచిగా ప్యాక్‌చేసి అందించాలన్న సీఎం
క్వాలిటీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదు: సీఎం
ప్రతి దశలోనూ బియ్యం నాణ్యతను పరిశీలించే ఏర్పాటు ఉండాలి:
బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ప్లాస్టిక్ బ్యాగులను తిరిగి వెనక్కి ఇచ్చేసేలా అవగాహన కల్పించాలి: సీఎం
లేకపోతే ఆ బ్యాగుల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది: సీఎం
నాణ్యమైన బియ్యం డోర్‌డెలివరీపై సీఎం వైయస్.జగన్ సమీక్ష